చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత

18-09-2026 | 08:03pm

విబిఐటి కళాశాల సెక్రటరీ డాక్టర్ జి. మనోహర్ రెడ్డి               

ఘట్ కేసర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో (Vijnana Bharathi Engineering College) నిర్వహిస్తున్న విభవ 2026 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను  ముఖ్యఅతిథిగా విబిఐటి కళాశాల సెక్రటరీ డాక్టర్ జి. మనోహర్ రెడ్డి (VBIT College Secretary Dr. G. Manohar Reddy) విచ్చేసి  శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులతో పాటు క్రీడలకు సమ  ప్రాధాన్యతను తమ కళాశాలలో ఇస్తున్నట్లు తెలిపారు. ఈటోర్నమెంట్ ఈనెల 18 తారీకు నుండి ప్రారంభమై 26వ తారీకు వరకు జరుగుతాయని కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి (College Physical Director Dr. M. Srinivasa Reddy) తెలిపారు.

మొత్తం 24 జట్లు పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.ఎస్. శ్రీనివాస్, ఐటి హెచ్ఓడి డాక్టర్ వి. శ్రీధర్ రెడ్డి, సివిల్  హెచ్ఓడి డాక్టర్ రామకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, సహాయ పీడీలు శివలాల్ వెంకట్, శ్రవణ్, సివిల్ ఫ్యాకల్టీ డాక్టర్ బోగయ్య నాయుడు క్రీడాకారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు