కుంకుమ పూజా సౌభాగ్యానికి ప్రతీక
18-09-2026 | 11:07pm
ముకరంపుర, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): అల్ఫోర్స్ విద్యా సంస్థ(Alphores Educational Institutions)ల్లో కుంకుమ పూజ నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి(Dr. V. Narender Reddy) కరీంనగర్ లోని వావిలాలపల్లిలో అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో ప్రతిష్టించినటువంటి గణపతి మండపంలో కుంకుమ పూజ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా మాట్లాడుతూ కుంకుమపూజ మహోత్సవం నిర్వహించడం మహాలక్ష్మి మాతకృపేనని అమ్మవారిని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. వేడుకలో భాగంగా భజన కార్యక్రమాన్ని నిర్వహించడం అదేవిధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షములు పొందడానికి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి జ్యోతులతో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.