పర్యావరణం, వ్యక్తిత్వవికాసంపై అవగాహన

18-09-2026 | 11:04pm

అర్థశాస్త్ర నిపుణుడు డాక్టర్ మీనయ్య..

దామరచర్ల సెప్టెంబర్ 18: పర్యావరణం ఆర్థిక వికాసం(Environment and Economic Development) మరియు వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై మండల పరిధిలోని బోత్తలపాలెం గ్రామంలో ఉన్నటువంటి మోడల్ స్కూలు, కళాశాలలో విద్యార్థులకు డాక్టర్.మీనయ్య శుక్రవారం అవగాహన సదస్సును నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ అనుకూలమైన ఆర్థికాభివృద్ధి కొనసాగాలని పర్యావరణ విధ్వంసక చర్యలను అరికట్టడానికి ప్రతి ఒక్కరు తొడ్పడాలని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే గుణమును అలవర్చుకున్నట్లయితే సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చని తెలిపారు.

అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ పోతూరాజు నరహరి మాట్లాడుతూ, ప్రతిఒక్కరి జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైనది కావున ప్రతి విద్యార్థి గుణాత్మక ఆలోచనలతో ముందు వెళ్ళాలని పేర్కన్నారు. ఒకవ్యక్తి యొక్క అభివృద్ధి ఆ వ్యక్తి ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి అవసరమైన కమ్యూనికేషన్స్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశ నుండి పెంపొందించుకొవాలి. విద్యార్థి దశ నుండి లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకొని ఆ లక్ష్యాలు సాదించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు