ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి
బోథ్. సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): చట్టాల పైన ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి కే సందీప్(Junior Civil Judge Sandeep) పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని నేరేడుపల్లి కొత్తపల్లి గ్రామాలలో న్యాయ సేవా అధికార సంస్థ(Legal Services Authority) ఆధ్వర్యంలో చట్టాలపైన అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఉండే ప్రతి ఒక్కరు చట్టాల గురించి తెలుసుకోవాలని కోరారు.
వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తో పాటు సరి అయిన వాహన పత్రాలు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలను స్థానికంగా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. కేసుల్లో ఇరుక్కుని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో ఏజిపి పంద్రం శంకర్, న్యాయవాది వార్ అసోసియేషన్ కార్యదర్శి ఠాగూర్ రూపేందర్ సింగ్ ,సందేశ్ తో పాటు మడవి మనోహర్ కనక అమృత రావు లీగల్ సిబ్బంది స్రవంతి గ్రామస్తులు పాల్గొన్నారు.