పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించడం అభినందనీయం

18-09-2026 | 04:07pm

శిక్షణ సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలి : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

ఉచిత డేస్ స్కాలర్ కోచింగ్ ప్రారంభం

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్‌(Police job notification)ను దృష్టిలో ఉంచుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువతకు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetti Sankeerth) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 75 రోజుల ఉచిత డేస్ స్కాలర్ శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిధిగా హాజరై ఎస్పీతో కలిసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) మాట్లాడుతూ.... పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న జిల్లా యువతకు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని అన్నారు.

ఎస్పీ మాట్లాడుతూ జిల్లా యువత పోలీస్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో నాణ్యమైన శిక్షణ అందించేందుకు 75 రోజుల ఉచిత డే స్కాలర్ శిక్షణను ప్రారంభించామని తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించడం ద్వారా యువతకు మంచి భవిష్యత్తుతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా, సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు. 75 రోజుల శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలకు, భూపాలపల్లి జిల్లాకు గర్వకారణంగా నిలవాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, భూపాలపల్లి సబ్ డివిజన్ డీఎస్పి సంపత్ రావు, ఎస్ఐలు, సీఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు