ఘనంగా సామూహిక కుంకుమార్చన

18-09-2026 | 06:59pm

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), సెప్టెంబర్ 18: గణేష్ నవరాత్రోత్సవాల్లో(Ganesh Navaratri Celebrations) భాగంగా మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ ఫస్ట్ వార్డులో అరుణోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శుక్రవారం సామూహిక కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పురోహితుల వేదమంత్రాలతో కుంకుమార్చన, సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం గణనాధునికి ప్రత్యేక పూజలు జరిపి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. తదనంతరం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం చేశారు.

మరిన్ని వార్తలు