నా జీవితం తెరిచిన పుస్తకం
18-09-2026 | 03:56pm
హైదరాబాద్: కాంగ్రెస్ నేతల(congress leaders) సిద్దిపేట పర్యటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) స్పందించారు. సిద్ధిపేట(siddipet)కు కాంగ్రెస్ నేతలు వస్తున్నారంట, నా భూములు చూసిపోతారంట అని చెప్పారు. నా భూములు చూసేందుకు అంతమంది పోలీసులు ఎందుకు?, మూడు జిల్లాల నుంచి 3 వేల మంది పోలీసులు ఎందుకు? అని ప్రశ్నించారు. మీరు వస్తారని నాకు చెబితే నేనే ఏర్పాట్లు చేసేవాడిని కాదా?, కాంగ్రెస్ నేతలకు అన్నం పెట్టి నా తోట చూపించేవాడిని కాదా! అని హరీష్ రావు చెప్పారు. నా భూమి చూడండి ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పండి, నా జీవితం తెరిచిన పుస్తకం నా ఆస్తులన్ని అఫిడవిట్ లో రాశానని సూచించారు. నా ఆస్తులు, నా పనితీరును చూసే ప్రజలు ఏడుసార్లు గెలిపించారని హరీష్ తెలిపారు.