జిల్లాలో హస్తప్రతుల గుర్తింపు సర్వే

18-09-2026 | 06:54pm

జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ 

మెదక్, సెప్టెంబర్ 18(విజయ క్రాంతి) : భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ(Ministry of Culture, Government of India) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్ఞాన్ భారత్ మిషన్ (Gyan Bharatam Mission) లో భాగంగా మన జిల్లాలో ఉన్న ప్రాచీన హస్తప్రతులు, తాటిఆకు గ్రంథాలు, పురాతన పత్రాలను గుర్తించి, సంరక్షించేందుకు భారీ సర్వే ప్రారంభమైందని జిల్లా కలెక్టర్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్ మాట్లాడుతూ అదనపు కలెక్టర్ నగేష్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు ద్వారా ఈ సర్వేపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

మన దేశ అమూల్యమైన సాంస్కృతిక, చారిత్రక మరియు విజ్ఞాన సంపదను కాపాడుకుని, వాటిని భావితరాలకు అందించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అని పేర్కొన్నారు.ఈ మిషన్ కింద జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించి, లభ్యమయ్యే హస్తప్రతులను అత్యాధునిక సాంకేతికతతో డిజిటలైజేషన్ చేసి నేషనల్ డిజిటల్ రిపాజిటరీ (NDR) లో భద్రపరుస్తారని చెప్పారు. జిల్లాలోని వివిధ దేవాలయాలు, మఠాలు, విద్యాసంస్థలు, లైబ్రరీలు, మ్యూజియంలు, పరిశోధకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న 75 సంవత్సరాలకు పైబడిన పురాతన హస్తప్రతుల వివరాలను అందించవచ్చు అన్నారు.

ఈ సర్వే పూర్తిగా స్వచ్ఛందమైనది. వివరిస్తూ వివరాలు సేకరించినంత మాత్రాన హస్తప్రతుల యాజమాన్య హక్కులు మారవనీ అన్నారు. ఒరిజినల్ ప్రతులు సదరు యజమానుల వద్దే ఉంటాయి. కేవలం వాటిని శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరిచి (Conservation), డిజిటల్ కాపీలను మాత్రమే తీసుకుంటారని వివరించారు. హస్తప్రతులు కలిగిన వారు నేరుగా జ్ఞాన్ భారత్ మిషన్ అధికారిక పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేయవచ్చు.

లేదా జిల్లా నోడల్ అధికారిని సంప్రదించవచ్చునని అన్నారు. ఆయుర్వేదం, జ్యోతిష్యం, గణితం, సైన్స్, తత్వశాస్త్రం, పురాణాలు, స్థానిక చరిత్రలు వంటి ఏ అంశానికి సంబంధించినవైనా, ఏ లిపి (స్క్రిప్ట్) లో ఉన్నా ఈ సర్వే ద్వారా నమోదు చేయబడునని చెప్పారు. జిల్లాలోని ప్రజలు, పండితులు, స్వచ్ఛంద సంస్థలు ఈ మహత్తర కార్యంలో భాగస్వాములు కావాలని, తమ వద్ద ఉన్న లేదా తమకు తెలిసిన ప్రాచీన పత్రాల సమాచారాన్ని అందించి ఈ జాతీయ మిషన్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. మరిన్ని వివరాల కోసం జిల్లా కలెక్టరేట్ 

కార్యాలయంలో నోడల్ అధికారిని యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ -8309507937 నెంబర్కు  సంప్రదించవచ్చునని కలెక్టర్ వివరించారు.

మరిన్ని వార్తలు