నిరుపయోగంగా జానలదిన్న సెగ్రిగేషన్ షెడ్

18-09-2026 | 06:26pm

వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్.

నేరేడుచర్ల, సెప్టెంబర్ 18(విజయ క్రాంతి): నేరేడుచర్ల మండలంలోని జానలదిన్నె గ్రామపంచాయతీలో(Janaladinne Gram Panchayat) లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్ (Segregation shed) ప్రస్తుతం నిరుపయోగంగా మారిందని బిఆర్ఎస్ యూత్ నాయకులు (BRS youth leaders) తక్కెళ్ళ నాగార్జున ఆరోపించారు. శుక్రవారం షెడ్డును పరిశీలించి మాట్లాడుతూ గ్రామంలో చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి నిర్వహించాల్సిన ఈ షెడ్ వినియోగంలో లేకపోవడంతో,చెత్త రోడ్ల వెంబడి పేరుకుపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నయన్నారు.

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల  దుర్వాసనలతో దోమలు,ఈగలు వ్యాప్తి చెంది ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.పంచాయతీ  పాలకవర్గం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సెగ్రిగేషన్ షెడ్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో షేక్ నాగుల్ మీరా,మధు,శ్రీనివాస్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు