calender_icon.png 4 December, 2024 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రగాళ్లను చంపుతాం

16-10-2024 01:44:49 AM

కట్లకుంటలో వాల్ పోస్టర్ల కలకలం

జగిత్యాల, అక్టోబర్ 15 (విజయక్రాంతి): మంత్రగాళ్లను చంపబోతున్నామంటూ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో వెలసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కట్లకుంట గ్రామంలో పలుచోట్ల మంత్రగాళ్లను ఒక్కొక్కళ్లను చంపబోతున్నాం అంటూ వాల్ పోస్టర్లు వెలిశాయి.

ఆ వాల్ పోస్టర్‌లో “మంత్రగాళ్లు తస్మాత్ జాగ్రత్త, మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్రగాళ్లను చంపబోతున్నాం. ఈ పని కట్లకుంట గ్రామంలోని గచ్చునూతి సమీపంలో ఇద్దరు మంత్రగాళ్లతో మొదలు పెడతాము.

ఆ తరాత గుండ్లవాడ గొల్ల, గౌండ్ల వాడ పాలకేంద్రం సమీపంలో కూడా మంత్రగాళ్లు అందరిని చంపుతాము. ఎవరిని, ఎప్పుడు, ఎలా చంపేది ముందే చెబుతున్నాం” అంటూ హెచ్చరించారు. గ్రామ ప్రజలు మంత్రగాళ్లకు సపోర్టు చేస్తే వారికి కూడా ప్రాణాపాయం తప్పదని హెచ్చరించడం కలకలం రేపుతున్నది.