రమేష్ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన ఓటీవీ ఛానల్ రిపోర్టర్, సీనియర్ జర్నలిస్టు బుధవారం గుండెపోటుతో మరణించిన టికే రమేష్ మృతదేహానికి గురువారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar), ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు(MLA Vijayaramana Rao), రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రమేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రిపోర్టర్ గా రమేష్ గడిచిన 20 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రమేష్ మరణం తీరని లోటు అని అన్నారు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కుటుంబ సభ్యుల తో అన్నారు... ఇందులో మంత్రి , ప్రభుత్వ విప్పు వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.