చివరిదాకా ఉత్కంఠరేపే ‘పంచనామా’

18-09-2026 | 06:54pm

ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్(Actor Bharath Srinivasan) ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘పంచనామా’(Panchanama). దీనికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించగా.. ఉదయభాను(Udaya Bhanu) నిర్మాత, షో రన్నర్‌గా వ్యవహరించారు. సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్(Web Series) మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉండగా, అన్నీ ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా ఉండటంతో ప్రేక్షకులు ఈ సిరీస్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారు. అందుకే కేవలం వారంలోనే 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

వరుసగా మూడు హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, చివరకు ఈ హత్యల వెనుకున్న కారణాన్ని తెలుసుకోవడం.. వంటి ఆసక్తికర అంశాలతో ఉత్కంఠభరితంగా మారింది. ఈ మొదటి సీజన్ క్లైమాక్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక వెంటనే రెండో సీజన్ చూసేయాలన్నంత ఇంట్రెస్ట్ కలిగించేలా ఉందీ మొదటి సీజన్.  ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా ‘ప్రేమిస్తే’ భరత్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. భరత్ తన పాత్రను కొత్త కోణంలో పోషించారు. ఇంకా ఈ సిరీస్‌లో మేధారెడ్డి, శివాజీరాజా, చరణ్‌బాబు, రూపాలక్ష్మి, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ తమ పాత్రలతో అలరిస్తున్నారు. మోహన్ శ్రీవత్స మేకింగ్, నరేశ్ కుమారన్ నేపథ్య సంగీతం, సందీప్ కాంత్ కెమెరా పనితీరు.. ఇవన్నీ సిరీస్‌ను ప్రేక్షకులకు చేరువ చేశాయి. 


మరిన్ని వార్తలు