ప్రాంతీయ చిత్రాల ఆదరించాలి
నిర్మల్ సెప్టెంబర్ 18 ( విజయ క్రాంతి): స్థానిక కళాకారులను ప్రోత్సహించి వారికి అవకాశాలు కల్పించాలని ‘కాగితపు పడవలు’ (kagitapu padavalu) చిత్రంలో నటించిన స్థానిక కళాకారులు కోరారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. తుకారం సారథ్యంలో నిర్మించబడ్డ " కాగితపు పడవలు" సినిమాను నిర్మల్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించడంతో పాటు, స్థానిక కళాకారులకు కూడా అవకాశం కల్పించారని తెలిపారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ.. స్థానిక నటీనటులకు సినిమాలో అవకాశాలు ఇవ్వడం అభినందనీయమన్నారు.
స్థానిక ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్న కళాకారులు ఉన్నారని, వారికి సరైన అవకాశాలు లభిస్తే మరింత రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బయట ప్రాంతాల సినిమాలను ఆదరించిన విధంగానే స్థానిక కళాకారులు, స్థానిక ప్రతిభను కూడా నిర్మల్ ప్రజలు ఆదరించాలని కోరారు. నిర్మల్‌లోని తిరుమల థియేటర్లో శుక్రవారం ‘కాగితపు పడవలు’ సినిమా విడుదలైందని, ప్రజలు థియేటర్‌కు వెళ్లి సినిమాను వీక్షించి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో కళాకారులు జబర్దస్త్ పులి, పి మోహన్ రావు, రాజన్న, లక్ష్మీకాంత్, గంగా ప్రసాద్, జి. రాకేష్, చిన్నయ్య, అట్టోళ్ల సాయి రెడ్డి, భీమయ్య, తదితరులు ఉన్నారు.