ఎంటీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

04-10-2026 | 02:45pm

పరిశుభ్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

రామగుండం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని ఎంటీవో (మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్) కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Police Commissioner Ambar Kishor Jha) ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలు, పోలీసు వాహనాల పార్కింగ్ ప్రాంతం, సిబ్బంది విశ్రాంతి బ్యారక్‌లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. పోలీసు వాహనాల నిర్వహణ, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యాలయ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని సీపీ స్పష్టం చేశారు. పరిశుభ్రమైన, క్రమబద్ధమైన వాతావరణం పోలీసు సేవల నాణ్యత, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు