వర్షాల అలర్ట్‌.. 8 జిల్లాలకు హెచ్చరిక

04-10-2026 | 02:24pm

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో మరోసారి వర్షాలు (Rain Alert) దంచికొట్టే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD (India Meteorological Department) పేర్కొంది.

ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Moderate Rain) కురిసే అవకాశం ఉండగా.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో వర్షాల ప్రభావం (Weather Impact) కొనసాగే అవకాశం ఉంది.

ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ (Weather Update) అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు