ఏఎంసీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యేకు వినతి

24-10-2026 | 10:01pm

25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నా.. అవకాశం కల్పించాలని విజ్ఞప్తి

చేవెళ్ల, అక్టోబర్ 24 (విజయక్రాంతి): చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ(Chevella Agricultural Market Committee) చైర్మన్ పదవికి తనకు అవకాశం కల్పించాలని దేవుని ఎర్రవల్లి గ్రామానికి(Devuni Erravalli Village) చెందిన మాజీ ఎంపీటీసీ ఏదిరే చంద్రయ్య చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను కోరారు. గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని(Congress Party) నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నానన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు సేవలందిస్తున్నానని ఆయన తెలిపారు. 2006లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఊరెళ్ల ఎంపీటీసీగా ఎన్నికై ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని చంద్రయ్య గుర్తుచేశారు.

ఇటీవల జరిగిన చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసినప్పటికీ ఓటమి ఎదురైందని పేర్కొన్నారు. అయినప్పటికీ పార్టీపై నమ్మకంతో, నిబద్ధతతో పనిచేస్తూ వస్తున్నానని తెలిపారు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు తమ కురుమ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి దక్కలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న తనకు ఈసారి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

పార్టీ కోసం చేసిన సేవలను, తన రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్యను కలిసిన వారిలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, బండారు ఆగిరెడ్డి, కరికే మల్లేశం, చింపుల మల్లారెడ్డి, ఏదిరే హరీష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు