మాజీ మంత్రి హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు
మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్, మండల కౌన్సిలర్లు
గుమ్మడిదల అక్టోబర్ 22: దసరా పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును(former minister Harish Rao) బీఆర్ఎస్ గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు(BRS State Leaders) చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు.
విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలని అన్నారూ. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు చక్రపాణి, కుమార్ గౌడ్,వెంకట్ రామ్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, శేఖర్ రెడ్డి, హుస్సేన్,మహేష్, ఫయాజ్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.