పోషకాహారంతో ఉజ్వల భవిష్యత్తు
పాలమాకులలో పోషణ మాసోత్సవాల్లో పాల్గొన్న ఏసీడీపీఓ హరిత
నంగునూరు,(విజయక్రాంతి): అందుబాటులోని ఆకుకూరలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని ఏసీడీపీఓ హరిత, సర్పంచ్ ఓజాలు పేర్కొన్నారు. నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించిన పోషణ మాసోత్సవాలలో వారు పాల్గొని మాట్లాడారు.ఖరీదైన ఆహార పదార్థాలే కాకుండా, మన చుట్టూ దొరికే ఆకుకూరల్లోనూ అద్భుతమైన పోషకాలు ఉంటాయని, వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం ఉచితంగా పౌష్టికాహారాన్ని అందిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రజిత,ఏఎన్ఎం పద్మ,పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, హెల్త్ అసిస్టెంట్ మహేందర్,అంగన్వాడీ టీచర్లు రజిత,నర్సమ్మ,రెహనా బేగం, ఆశ వర్కర్లు,బాలింతలు,చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.