విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలు
సిద్దిపేట జిల్లా పాలమాకులలో ఘటన
నంగునూరు,(విజయక్రాంతి): విద్యుదాఘాతం(electric shock)తో లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలైన ఘటన శనివారం నంగునూరు మండలం పాలమాకులలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... రాంపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని పాలమాకుల జేఎల్ఎం పడిగె శ్రీనివాస్ గ్రామంలో విద్యుత్ సమస్య ఏర్పడడంతో విధుల్లో భాగంగా ఎల్సీ తీసుకొని హనుమాన్ దేవాలయం(Hanuman Temple) సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మత్తులు చేపట్టారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురికావడంతో శ్రీనివాస్ చేతులు కాలిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే ఆయనను అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం చేతి స్పర్స కోల్పోవడంతో పాటు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.పాలమాకుల గ్రామానికి ఒక ప్రాంతానికి రాంపూర్ నుంచి, మరో ప్రాంతానికి రాజగోపాల్‌పేట సబ్‌స్టేషన్ల నుంచి వేర్వేరుగా విద్యుత్ సరఫరా అవుతోంది.గ్రామం అంతటికీ ఒకే సబ్ స్టేషన్ నుంచి కరెంట్ సరఫరా చేయాలని గతంలో కోరినా ఏఈ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.అధికారుల,ఏఈ నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.