ఎస్ఐ, పీసీ అభ్యర్థులకు ఉచిత మాక్ టెస్ట్

24-10-2026 | 09:37pm

సిద్దిపేట క్రైం, అక్టోబర్ 24 : ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ  అభ్యర్థులు(Candidates for SI and Constable posts) మాక్ టెస్టును సద్వినియోగం చేసుకోవాలని సీపీ రష్మీ పెరుమాళ్(CP Rashmi Perumal) సూచించారు. టీజీపీఆర్బీ పరీక్షా విధానానికి అనుగుణంగా రూపొందించిన ఈ మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవచ్చని  తెలిపారు. ఈ నెల 25న సిద్దిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో(Indur Engineering College, Siddipet) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాక్ టెస్ట్(Mock Test) ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు నేరుగా హాజరుకావచ్చని, మిగతా అభ్యర్థులకు పరీక్షా కేంద్రం వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు