World Cup 2027: టీమిండియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్
వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. టీమిండియా మ్యాచ్‌ల తేదీలు ఇవే!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ICC World Cup 2027 Schedule వచ్చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు వన్డే వరల్డ్ కప్ జరగనుంది. మొత్తం 14 జట్లు పోటీపడనున్న ఈ మెగా టోర్నీలో భారత్ గ్రూప్-Aలో చోటు దక్కించుకుంది.
ఆస్ట్రేలియాతోనే టీమిండియా తొలి పోరు
డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తన World Cup 2027 Campaignను ప్రారంభించనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్‌కు ఇది రీమ్యాచ్ కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
అక్టోబర్ 10న అసలు హై-వోల్టేజ్ ఫైట్
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే India vs Pakistan World Cup 2027 మ్యాచ్‌కు కూడా డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి.
టీమిండియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు
అక్టోబర్ 7: భారత్ vs ఆస్ట్రేలియా — కేప్‌టౌన్
అక్టోబర్ 10: భారత్ vs పాకిస్థాన్ — జోహన్నెస్‌బర్గ్
అక్టోబర్ 14: భారత్ vs ఆఫ్ఘనిస్థాన్ — త్ష్వానే
అక్టోబర్ 17: భారత్ vs క్వాలిఫయర్ A — బ్లూమ్ఫోంటెయిన్
అక్టోబర్ 24: భారత్ vs జింబాబ్వే — విక్టోరియా ఫాల్స్
భారత్ ఉన్న గ్రూప్-Aలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వేతో పాటు క్వాలిఫయర్ A జట్టు ఉండనుంది. గ్రూప్ దశలో భారత్ ఆడే ఐదు మ్యాచ్‌ల తేదీలు, వేదికలు ఇప్పటికే ఖరారయ్యాయి. ఇక నాకౌట్ దశలోకి వెళ్తే.. గ్రూప్ దశ అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన Super 7 దశ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు జరగనుంది. సెమీఫైనల్స్ నవంబర్ 17, 18 తేదీల్లో, వరల్డ్ కప్ ఫైనల్ నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది.