మారిన హైదరాబాద్ పోలీస్ మ్యాప్!
జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ(GHMC Reorganisation)కు అనుగుణంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను కూడా పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలోని పోలీస్ డివిజన్లు, స్టేషన్లలో పలు మార్పులు చేశారు. బండ్లగూడపేట్ పోలీస్ స్టేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే మూడు పోలీస్ డివిజన్ల పేర్లను మార్చడంతో పాటు వాటి కొత్త పరిధులను కూడా ఖరారు చేశారు.
రాజీవ్ గాంధీ విమానాశ్రయ డివిజన్ పేరును శంషాబాద్ డివిజన్‌గా, చిక్కడపల్లి డివిజన్ పేరును కాచిగూడ డివిజన్‌గా మార్చారు. సంతోష్‌నగర్ డివిజన్‌ను ఛత్రినాక డివిజన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పోలీస్ కమిషనరేట్ పరిధిని కూడా సర్దుబాటు(Adjustment) చేస్తూ ఈ మార్పులు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.