ఇవాళ ఆయుధ పూజ ఇలా చేయండి

19-10-2026 | 11:13am

శరన్నవరాత్రుల (Sharannavaratri) సందర్భంగా మహర్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజలు (Ayudha Puja) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తమ వాహనాలు, వృత్తిపరమైన పనిముట్లు, పుస్తకాలను శుభ్రం చేసి పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరిస్తున్నారు. అనంతరం దుర్గమ్మ అమ్మవారి చిత్రపటం ముందు ఆయా వస్తువులను ఉంచి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు (Special Prayers) చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విజయదశమి రోజున కూడా ఆయుధ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. పూజలు పూర్తయిన అనంతరం ఆయా వస్తువులతో పనులు ప్రారంభిస్తే శుభం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. తమ వృత్తికి, దైనందిన జీవితానికి ఉపయోగపడే వస్తువులను దైవస్వరూపంగా భావించి పూజించడం ఈ సంప్రదాయం (Tradition) ప్రత్యేకతగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు