పీరియడ్స్ సరిగ్గా రావడం లేదా? ఇదీ ట్రై చేయండి!
పీరియడ్స్ (Periods) సరిగ్గా రావడం లేదా? అయితే ఉల్లిపాయ కషాయం (Onion Decoction) గురించి తెలుసుకోండి. ఒక ఉల్లిపాయను తీసుకుని పై తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో 3 కప్పుల నీళ్లు పోసి, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మరిగించాలి.
నీరు సుమారు ఒక కప్పు అయ్యే వరకు మరిగించిన తర్వాత వడకట్టి తీసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగవచ్చు. ఈ డ్రింక్ (Drink) పీరియడ్స్ సక్రమంగా రావడానికి, పీరియడ్స్‌కు సంబంధించిన కొన్ని సమస్యల్లో ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్ తరచుగా సక్రమంగా రాకపోయినా, ఎక్కువగా బ్లీడింగ్ (Bleeding) అయినా లేదా తీవ్రమైన నొప్పి ఉన్నా వైద్యుడిని సంప్రదించడం మంచిది.