కేబీఆర్ చుట్టూ వన్‌వేనే పర్మినెంట్
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను రద్దు (cancel) చేయాలని అధికారులు నిర్ణయించారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ వరకు 4.4 కిలోమీటర్ల మేర సిక్స్ లేన్ ఫ్లైఓవర్ (flyover) నిర్మించనున్నట్లు తెలిపారు.అలాగే బంజారాహిల్స్‌లో రోడ్ 10-12 మధ్య ప్రతిపాదించిన అండర్‌పాస్‌ను కూడా రద్దు చేయనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం అమలు చేస్తున్న వన్‌వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించారు.
వన్‌వేకు ప్రజల నుంచి మంచి స్పందన (response) రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పులతో ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.400 కోట్లు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. డివైడర్లను తగ్గించి రహదారులను సిక్స్ లేన్‌గా అభివృద్ధి చేయనున్నారు. దీంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నిర్వహణలో (traffic management) కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.