అంగన్వాడీల సేవలు మరిచిపోలేం: బిజెపి జిల్లా అధ్యక్షులు
బోథ్ అక్టోబర్ 2 (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్లు చాలీచాలని వేతనాలతో చేస్తున్న సేవలను మరిచిపోలేమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం(BJP District President Patangi Brahmanandam) పేర్కొన్నారు. శుక్రవారం సోనాల మండల కేంద్రంలో అంగన్ మిలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మండల అధ్యక్షులు బోరే రవీందర్ అధ్యక్షులు వహించారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రధానినరేంద్ర మోడీ పుట్టినరోజు పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు అంగన్వాడి టీచర్లు గ్రామపంచాయతీ కార్మికులు పడుతున్న కష్టాలను స్వయంగా వెళ్లి తెలుసుకోవాలన్న దృక్పథంతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్నారు.
ఈ సందర్భంగా వారి వద్దకు వెళ్లి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. చాలీచాలని వేతనాలతో వారు చేస్తున్న సేవలు అమోఘం అన్నారు. అంగన్వాడీ టీచర్లను పరిశుద్ధ కార్మికు లను సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ముస్తాపూరి అశోక్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుమన్ రాథోడ్ అదిలాబాద్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి జీవి రమణ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నివేదిత ఓబీసీ కార్యదర్శి మిత్కారే రాజేశ్వర్ మాజీ మండల అధ్యక్షులు సుభాష్సూర్య మండల కార్యదర్శి కచ్చ కాయల హరీష్ బాసెట్టి రమేష్ కసిరే పోతన్న అశోక్ గులాబ్ మహిపాల్ అంగన్వాడీ కార్యకర్తలు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.