కొలాం గిరిజనులకు న్యాయం చేయాలని రాష్ట్ర కమిషన్ సభ్యులకు వినతి

12-10-2026 | 05:42pm

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్(Utnoor) మండలంలోని కోలాం గిరిజనులకు న్యాయం చేయాలని వారి మంజూరైన ఇందిరమ్మ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారుల అడ్డంకులను తొలగించాలని కోరుతూ సోమవారం హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్  ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కమిషనర్ మెంబర్ హుస్సేన్ నాయక్(Telangana ST Commissioner Hussain Naik)కు వినతి పత్రం అందజేసినట్లు బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ తెలిపారు.

ఖానాపూర్ నియోజకవర్గంలోని  ఉట్నూర్ మండలంలోని  పలు గ్రామాలకు గ్రామాలకు చెందిన  ఆదివాసి కొలం గూడ గ్రామ ప్రజలతో కలసి స్థానిక  సమస్యలతో పాటు  కావ్వాల్ టైగర్ జోన్ గ్రామాలల్లో ప్రధాన మంత్రి గిరిజన అవస్ యోజన(పీవీటీజీ) ఇండ్లు  ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోడానికి అనుమతి ఇప్పించగలరని ఎస్టి కమిషనర్ మెంబర్ బానోత్ హుస్సేన్ నాయక్ కు రితేష్ రాథోడ్ గిరిజన నాయకులు వారికీ వినతిపత్రంలో వివరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సానుకూలంగా స్పందించి ఫారెస్ట్ అధికారులతో  పూర్తి వివరాలు తెలుసుకొని  తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని రితేష్ రాథోడ్ అన్నారు.  ఆయనతోపాటు  గిరిజన నాయకులు సిడం బాపూరావు, టెకం భీంరావ్, కొడప  లేటు, ఆత్రం తుకారం, గిరిజన నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు