రైతులకు కరెంటు, సాగునీరు వెంటనే అందించాలి

12-10-2026 | 05:13pm

ఎల్‌నినో హెచ్చరికలను పట్టించుకోని ప్రభుత్వం

ఎండిపోతున్న పంటలు

హుజురాబాద్,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావం(Impact of El Niño)తో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, రాజపల్లి సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, కౌన్సిలర్ వర్థినేని రవీందర్ రావు విమర్శించారు.

సాగునీరు అందించేలా కృషి చేయాలని ఎంపీడీవోకి ప్రజావాణిలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సాగునీరు అందక చేతికొచ్చే దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఎండీ ఆయకట్టుకు, కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) ద్వారా సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రాజకీయ కారణాలతో రైతులకు అన్యాయం చేయకుండా కనీసం ఒక్క తడి నీరందించి పంటలను కాపాడాలని కోరారు. అలాగే వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా సరఫరా చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు