కందనూల్ జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు.!

12-10-2026 | 05:08pm

- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న కలెక్టర్ హేమంత్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ప్రధానమంత్రి ధన్‌-ధాన్య కృషి యోజన(Pradhan Mantri Dhan-Dhaanya Krishi Yojana) అమలులో నాగర్‌ కర్నూల్ జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Union Agriculture Minister Shivraj Singh Chouhan) చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) అవార్డు అందుకున్నారు. రైతుల ఆదాయం, పంటల ఉత్పాదకత పెంపు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం అమలవుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంత్ రావు, వ్యవసాయ శాస్త్రవేత్త ఓ. శైలా, ప్రగతిశీల రైతు రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు