పార్టీ పటిష్టత కోసం అధ్యక్షులు కృషి చేయాలి

19-09-2026 | 09:39pm

బోథ్,(విజయక్రాంతి): గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టం చేసి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ(Congress party) మండల అధ్యక్షులు మెరుగు భోజన్న పిలుపునిచ్చారు. మండలంలో ని 22 గ్రామపంచాయతీలకు(Gram Panchayats) సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు. నూతనంగా నియమించిన అధ్యక్షులతో ఆయన సమావేశమై పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.

ప్రతి గ్రామ అధ్యక్షులు గ్రామంలోని ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వపరంగా వారికి అంది సంక్షేమ పథకాలు చేరే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జి.రాజు యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, మండల అధ్యక్షులు ఆశన్న, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా అధ్యక్షులు అంజయ్య, మండల అధికార ప్రతినిధి అచ్యుత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కౌసర్, ప్రధాన కార్యదర్శి అబూద్, సహకార సంఘం డైరెక్టర్ చట్ల ఉమేష్, మాజీ ఎంపిటిసి షేక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సాయన్న, అనిల్ జగన్ అబ్రార్, అభివృద్ధి, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు