కొత్త రైల్వే లైన్ కోసం రాస్తారోకో
30-09-2026 | 01:48pm
బేల సెప్టెంబర్ 30(విజయక్రాంతి): ఆదిలాబాద్–జైనథ్–బేల మీదుగా మహారాష్ట్రలోని గడ్చందూర్ వరకు కొత్త రైల్వే లైన్(New railway line) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. బుధవారం యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సామ రూపేశ్ రెడ్డి ఆధ్వర్యంలో బేల జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు.
కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి రైల్వే లైన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆదిలాబాద్–జైనథ్–బేల ప్రాంతాల అభివృద్ధికి కొత్త రైల్వే లైన్ ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.