పేదల ఇంటి కలకు శ్రీకారం

30-09-2026 | 01:51pm

భిక్కనూర్,సెప్టెంబర్‌ 30(విజయ క్రాంతి): భిక్కనూర్‌ మండలం కంచర్ల గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల(Indiramma's house) నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యతతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి,మండల కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి నర్సాగౌడ్‌, సర్పంచ్‌ అరుణస్వామి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మహేందర్, సీద్ద రాములు ,మహేందర్ సిద్ధ రాములు, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి,నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు