Breaking News

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

26-09-2026 | 05:29pm

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి(Adilabad RIMS Hospital)లో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఉట్నూర్ మండలం(Utnur Mandal) మోమిన్‌పూర్‌కు చెందిన సభ సమ్రీన్   శిశువు దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఈ విషాద ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(MLA Bojju Patel) బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.5 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం(fire accident) అత్యంత విషాదకరమైన ఘటన అని, చిన్నారి మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో ఉందని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారి కష్ట సమయంలో సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అవసరమైన ఇతర సహాయ సహకారాలు కూడా అందేలా అధికారులతో సమన్వయం చేస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ఆయనతోపాటు  కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు