జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి అరిగెల సన్మానం

26-09-2026 | 05:40pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని జనకాపూర్ పాఠశాలలో(Janakapur School) ఉపాధ్యాయుడిగా(Teachers) విధులు నిర్వహిస్తున్న ధర్మపురి వెంకటేశ్వర్లు(Dharmapuri Venkateswarlu) జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా(Best teacher) ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వరరావు తన నివాసంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అరిగెల మాట్లాడుతూ వెంకటేశ్వర్లు విద్యార్థులను(Students) ఉన్నత స్థానాలకు తీర్చిదిద్దుతూ, గతంలో రాష్ట్రస్థాయి అవార్డు కూడా అందుకున్నారని పేర్కొన్నారు. సాంస్కృతిక, కవితా, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైతన్య కళాశాల డైరెక్టర్ సాయిని రాజశేఖర్, బీజేపీ నాయకులు సుంకరి పెంటయ్య, గాజుల రాజేంద్రప్రసాద్, ప్రసాద్ గౌడ్, గాజుల సత్యనారాయణ, దీపక్ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు