చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం

26-09-2026 | 05:06pm

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): చాకలి ఐలమ్మ(Chakali Ilamma) పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Ashish Sangwan) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె 131వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ చరిత్రలో సామాజిక న్యాయం(Social Justice), ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ధైర్యంగా పోరాడిన వీరవనితగా చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, నిబద్ధత, పోరాట పటిమ నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం కల్పించడమే చాకలి ఐలమ్మ ఆశయాలకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్. వై.గిరి, తహసీల్దార్ హిమబిందు, బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్  చైర్మన్  ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గోదావరి స్వామి, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నాగరాజు, శివరాములు, కొత్తపల్లి మల్లయ్య, మహేశ్, రాజయ్య, శ్రీకాంత్, గణేష్, విఠల్, వినోద్, నాగభూషణం, టీఎన్జీవోఎస్' అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, నరేష్, పవన్, స్వామి, సునీత, విజయశాంతి, శాంతయ్య, కృష్ణప్రసాద్, శ్రీకర్ తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు