ఈ ఏడాది ఉపాధి హామీ కూలీల సంఖ్య పెరిగేలా చూడండి.
బోథ్(విజయక్రాంతి) ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం(El Nino Impact) వల్ల కరువు పరిస్థితులు ఎదురయ్యే ఆస్కారం ఉన్నందున ఉపాధి హామీ కూలీల(Employment Guarantee Scheme workers) సంఖ్య మరింతగా పెరిగే విధంగా చూడాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు(Sonala MPDO Ratnakar Rao) పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉపాధి హామీ సిబ్బందితో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న రైతులు, రైతు కూలీలు ఉపాధి హామీ పనుల్లో చేరే విధంగా కృషి చేయాలని కోరారు.
అనేక రకాల పనులకు ఉపాధి హామీ కార్యక్రమంలో అనుమతులు వచ్చాయని వాటిని ప్రజలకు వివరించాలని ఎంపీడీవో సూచించారు. ఏ ఒక్క కూలి కూడా వలస వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. గ్రామాలలో కార్యదర్శులు సర్పంచులు ఉపాధి హామీ సిబ్బంది ఉపాధి హామీ పనులను వేగవంతంగా చేపట్టాల్సి ఉందన్నారు.