వికలాంగులకు అన్నదానం
05-10-2026 | 07:41pm
సుల్తానాబాద్, అక్టోబర్ 05 (విజయక్రాంతి): దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి(Gaddam Venkatswamy) కాక 97వ జయంతి సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని మానసిక వికలాంగులు మరియు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరేపల్లి రాహుల్, నీరాటి శంకర్, మాజీ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్, కనుకుంట్ల శ్రీనివాస్, జొన్నాల రవీందర్, దొడ్ల దేవేందర్, దరాడే శ్యామ్, గడ్డం సతీష్, చొప్పరి రాజు తదితరులు పాల్గొన్నారు.