పట్టపగలే స్ట్రీట్ లైట్లు.. కరెంట్ బిల్లు గోవిందా!

27-10-2026 | 11:48am

బేల, అక్టోబర్‌ 27 (విజయక్రాంతి): మండలంలోని జూనోని గ్రామం(Junoni Village)లో రాత్రివేళ ప్రజలకు వెలుతురు అందించాల్సిన వీధి దీపాలు పట్టపగలే వెలుగుతున్నాయి. దీంతో విద్యుత్‌ వృథా(Wastage of electricity) అవుతోంది. పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వీధి దీపాలు పగటిపూట వెలగడం వల్ల విద్యుత్‌ వృథా కావడమే కాకుండా నిర్వహణ తీరుపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యుత్‌ పొదుపుపై అవగాహన కల్పించాల్సిన సమయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

అధికారులు స్పందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలను ఆర్పేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యుత్‌ వృథాను అరికట్టి, వీధి దీపాలు అవసరమైన సమయాల్లో మాత్రమే వెలిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు