తెలంగాణకు తుపాను ఎఫెక్ట్

27-10-2026 | 06:23am

అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది.

జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు (Gusty Winds) వీచే అవకాశం ఉంది.

రేపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు (Extremely Heavy Rainfall) కురిసే సూచనలు ఉన్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రేపు భూపాలపల్లి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rainfall) కురిసే సూచనలు ఉన్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

మరిన్ని వార్తలు