హాస్టల్కు వెళ్లాలంటే హెల్త్ టెస్టుల తిప్పలా?
చెన్నూర్, ( విజయక్రాంతి): దసరా సెలవులు ముగిసి పాఠశాలలు(Schools have closed), వసతి గృహాలు పునఃప్రారంభమవుతున్న వేళ విద్యార్థుల తల్లిదండ్రులకు అవస్థలు తప్పడం లేదు. విద్యార్థుల ఆరోగ్య పరీక్షల కోసం మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం(Chennur town)లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు బారులు తీరారు. వసతి గృహాలకు పిల్లలను పంపించాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొనడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థుల రద్దీ ఉంటుందని తెలిసినా ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థుల ఆరోగ్య పరీక్షల నిర్వహణలో సమన్వయం కొరవడటంతో తల్లిదండ్రులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థుల ఆరోగ్యం పేరుతో తల్లిదండ్రులను ఇన్ని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం? అధికారుల నిర్లక్ష్యానికి తల్లిదండ్రులు మూల్యం చెల్లించాలా? ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరిచి, తక్షణమే తగిన ఏర్పాట్లు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.