సత్తుపల్లిలో మహిళల కబడ్డీ సమరం
దమ్మపేట, అక్టోబర్ 26(విజయ క్రాంతి): రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస(Minister Ponguleti Srinivasa) రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించనున్న 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీల పోస్టర్‌ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) ఆవిష్కరించారు. గండుగలపల్లి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు.
మాజీ టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో మువ్వా యూత్ సత్తుపల్లి వారి నిర్వహణలో ఈ కబడ్డీ పోటీలు(Kabaddi competitions) అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్ వేదికగా జరగనున్నాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా క్రీడాకారిణులు పాల్గొననున్నారు. మహిళలు క్రీడారంగంలో మరింతగా రాణించేందుకు ఇలాంటి రాష్ట్రస్థాయి పోటీలు దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలను విజయవంతం చేయడానికి క్రీడాభిమానులు, యువత, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.