ఫడణవీస్‌తో రేవంత్ చర్చలు సక్సెస్: సీఎం
హైదరాబాద్: తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర(Maharashtra) సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలను పెద్ద మనసుతో పరిశీలించిన ఫడణవీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ(Thummidihetti Barrage) ఎత్తు పెంపునకు సంబంధించిన సాంకేతిక అంశాలు, ముంపు ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ఈ కమిటీ ఏర్పాటుకు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు సహకరిస్తానని మహారాష్ట్ర సీఎం హామీ ఇచ్చినట్లు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు సాగు, తాగునీటి సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమావేశంలో తెలంగాణ ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరంగా ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు భూములు, పరిహారం వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు తదుపరి అధ్యయనం చేయనున్నారు.