దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు!
టేకులపల్లి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): శ్రీ దుర్గమ్మ నవరాత్రుల సందర్భంగా టేకులపల్లి మండలం కోయగూడెంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ఇల్లందు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ(Special Pooja) కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని కోయగూడెంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కోయగూడెం సర్పంచ్ కోరం సుభాష్ చంద్రబోస్ పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.