సమాచార హక్కు చట్టంపై సర్పంచ్ పగడాల రమాదేవికి శిక్షణ
దమ్మపేట, అక్టోబర్ 24(విజయక్రాంతి): హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి(Dr. Marri Channa Reddy Human Resource Development) కేంద్రంలో అక్టోబర్ 22 నుండి 24 వరకు సమాచార హక్కు చట్టం(Right to Information Act) (ఆర్ టి ఐ), గ్రామ సభల నిర్వహణ పై రాష్ట్రంలోని ఎంపిక చేయబడిన సర్పంచులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజక వర్గం నుండి ఇద్దరు సర్పంచులను ఎంపిక చేయగా దమ్మపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ పగడాల రమాదేవి కి అవకాశం లభించింది.
ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పౌరులకు లభించిన అత్యంత శక్తివంతమైన హక్కు సమాచార హక్కు చట్టమని తెలిపారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జబాబుదారీతనం తీసుకురావడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.