ట్రస్మా అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక
చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండల ట్రస్మా (TRSMA) నూతన అధ్యక్షుడిగా జోగాపూర్ వాగ్దేవి స్కూల్ కరస్పాండెంట్ రాజూరి సద్గుణాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అలాగే ఉపాధ్యక్షుడిగా, మహోదయ స్కూల్ కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ, ప్రతిభావిద్యాలయం ప్రతినిధి కొడగంటి గంగాధర్ ను కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా పత్తిపాక నాగరాజు, లింగాల లింగయ్య, చిన్నమనేని రాజేశ్వరరావు లను ఎన్నుకున్నారు . ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. నూతన అధ్యక్షుడు సద్గుణాచారిని శాలువాతో సత్కరించారు. ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెంపునకు నూతన కార్యవర్గం కృషి చేయాలని సమావేశంలో ఆకాంక్షించారు.