పద్మశాలి నాయకుల విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా ఎస్పీ

23-10-2026 | 03:05pm
  1. లక్ష్మీనారాయణ బలవన్మరణంపై సమగ్ర విచారణ.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు 
  2. ఎస్పీ భరోసా

పాల్వంచ, (విజయక్రాంతి): భద్రాచలంలోని గోదావరి లాడ్జిలో హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ బలవన్మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పద్మశాలి సంఘం నాయకులు(Leaders of the Padmasali Association), కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కుమార్తె తన తండ్రి మృతికి కారణమైన పరిస్థితులపై విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని కన్నీటి పర్యంతమవుతూ కోరారు. పద్మశాలి సంఘం నాయకులు సైతం నిష్పక్షపాత విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ఎస్పీ

వినతిపై స్పందించిన ఎస్పీ రోహిత్ రాజ్.. కేసును క్షుణ్ణంగా విచారించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని తెలిపారు.  చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, బాధ్యులుగా తేలిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు వై.ఎస్. రావు, గుండు రవికుమార్, వేముల ప్రసాద్ బాబు, వేముల సతీష్, వేముల మధుకర్, ఇమంది ఉదయ్ కుమార్, పుట్టా శంకరయ్య, తోటకూర శ్రీనివాసరావు, పిండిపోలు కన్నయ్య, దోమల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు