ప్రతిభ ఉండి వెనుకబడే ప్రతి ఒక్క కుటుంబాన్నికి తోడుగా ఉంటున్న

23-10-2026 | 04:07pm

మాజీ ఎమ్మెల్యే కందాళ...

కూసుమంచి, అక్టోబర్ 23(విజయక్రాంతి): కూసుమంచి గ్రామానికి చెందిన మహమ్మద్ ఖదీర్ కుమార్తె మారియా తనీమ్ రైఫిల్ షూటింగ్ క్రీడలో(Rifle shooting sport) రాణిస్తోంది 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో, జాతీయ పోటీలలో బంగారు పతకం మరియు ఐఎస్ఎస్ఎఫ్ జాతీయ పోటీలలో ముందంజలో ఉండి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ టీమ్ ఇవేంట్ కు(Khelo India University Games Team Event) అర్హత సాధించి, జాతీయ జట్టు కొరకు నిర్వహించె ట్రయల్స్ లో పాల్గొంటున్న మారియా,

తన రైఫిల్ సెకండ్ హ్యాండ్ ది కావడంతో ప్రతి ట్రయల్ లోను స్వల్ప తేడాతో జాతీయ జట్టు లో స్థానం చెజార్చుకుంటున్న మారియా కొత్త రైఫిల్ కొనగలిగే ఆర్ధిక స్థోమత లేక  *పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని సంప్రదించింది, మారియా ప్రతిభను గుర్తించిన కొత్త రైఫిల్ కొనుగోలు కొరకు తన వంతు సహాయంగా ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ లో స్పోర్ట్స్ కోటా లో ఎంబిఏ లో స్థానం సాధించిన మారియా,ప్రతి నెల 15 రోజుల పాటు చెన్నై లోని జియఫ్జి షూటింగ్ రేంజ్ లో ప్రముఖ కోచ్ నేహా చవన్ పర్యవేక్షణ లో శిక్షణ పొందుతోంది,అటు చదువు లోను ఇటు షూటింగ్ క్రీడ లోను రాణిస్తున్న మారియా  భవిష్యత్తు లో ఉన్నత స్థానంలో నిలవాలని కందాళ ఉపేందర్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మారియా తండ్రి మహమ్మద్ ఖదీర్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఆపదల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటున్న పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాలాంటి వారిని ఎంతో మందిని ఆదుకున్నారని ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేక వెనుకబడే ప్రతి ఒక్కరి ఆశా కిరణం ఇలాంటి నాయకుడు పాలేరు నియోజకవర్గానికి ఒక్క వరమని, ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు