తాతా మధుని తక్షణమే పార్టీ సభ్యత్వం, ఎంఎల్సీగా తొలగించాలి

09-09-2026 | 08:21am

తాతా మధు దిష్టి బొమ్మ దహనం

గుండాల, (విజయక్రాంతి): పినపాక నియోజకవర్గం(Pinapaka) శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు జిల్లా డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న(DCC President Thota Devi Prasanna) సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే ఖదీర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) మండల అధ్యక్షులు ఊకె బుచ్చయ్య అధ్యక్షతన మండల కేంద్రంలో ఎమ్మెల్సీ తాతా మధుపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి, ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు.

అనంతరం కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఖదీర్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బొమ్మర్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ..దళిత నాయకుడనే ఒక చులకన భావంతో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్(Legislative Assembly Speaker Gaddam Prasad) పై బీఆర్ఎస్ పార్టీ ఎంఎల్సీ తాతా మధు చేసిన అసభ్య వ్యాఖ్యలపై  మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు చేసుకోవడం సహజమే కానీ వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై చేసిన వ్యాఖ్య కాదని శాసనసభ పీఠాన్ని, దళిత సమాజాన్ని అవమానించడమేనని, తాతా మధును వెంటనే ఎంఎల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలని, పార్టీ నుండి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామపంచాయతీల సర్పంచులు, కాంగ్రెస్, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు