మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లు

09-09-2026 | 08:37am

పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న సీతక్క

వీటిపైనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు(Telangana Monsoon Assembly Session Day 3) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క(Minister Seethakka) సభలో ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లుపై(Panchayat Raj Act) సభలో చర్చ జరగనుంది. శనివారం కూడా శాసనసభ సమావేశాలు కొనసాగుతాయని సభ్యులు వెల్లడించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar)పై వ్యాఖ్యల వ్యవహారంపై ఇవాళ మండలిలో చర్చ జరిగే అవకాశముంది. సభలో మళ్లీ రాజకీయ రచ్చకు ఛాన్స్ ఉంది. సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ఇష్యూపై బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) సభ్యులు పట్టుబట్టారు. రైతు, ధాన్యం కొనుగోళ్లు, కాళేశ్వరం, 22ఏ భూములు, ఆర్టీసీ, చేనేత, బీసీ మహిళల సమస్యలపై సభలో చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు