బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ... ఉదాహరణలు ఇవే
హైదరాబాద్: కాసేపట్లో మూడో రోజు తెలంగాణ వర్షాకాల సమావేశాలు(Telangana Monsoon Session) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు(Congress leaders) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ పై కీలక ప్రశ్నలు సంధించారు. గతంలో దళితుడిని సీఎం ఎందుకు చేయలేదో చెప్పలేకపోయారని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. గతంలో ఉపముఖ్యమంత్రి ఉన్న రాజయ్యను(Rajayya) ఎందుకు బర్తరఫ్ చేశారో తెలియదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్(Government Whip Addanki Dayakar) పేర్కొన్నారు. దళిత వ్యతిరేక పార్టీగా బీఆర్ఎస్ ఉండదనేందుకు ఇవే ఉదాహరణలని అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన పనికి ఎన్నికల సంఘం పార్టీనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనుచితంగా వ్యవహరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad) ను దూషించడమే కాక నిరసనలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి:
సస్పెన్షన్‌పై తాతా మధు రియాక్షన్
లోక్ భవన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు